ఈవారం ఓటీటీలోకి క్రేజీ సినిమాలు

ఇప్పుడు ఓటీటీ హవా ఏ రేంజ్ లో ఉందో చూస్తూనే ఉన్నాం కదా. థియేటర్లలో సినిమాలు రిలీజ్ అవుతున్నా కానీ ఓటీటీ హవా ఏ మాత్రం తగ్గలేదు. ప్రతి వారం ఓటీటీలో సందడి చేయడానికి చాలా సినిమాలు క్యూ కడుతూనే ఉన్నాయి. ఇక ఈవారం కూడా పలు పైగా సినిమాలు రిలీజ్ కు సిద్దంగా ఉండగా.. కొన్ని సినిమాలు స్ట్రీమింగ్ కు వచ్చేశాయి.

వాటిలో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా టిల్లు స్క్వేర్ సినిమా. రామ్ మల్లిక్ దర్శకత్వంలో యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ, యంగ్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా వచ్చిన సినిమా టిల్లు స్క్వేర్. ఈసినిమా మార్చి 29వ తేదీన రిలీజ్ అయింది. ఇక ఈసినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను అందించింది. కలెక్షన్స్ పరంగా కూడా సాలిడ్ కలెక్షన్స్ ను అందించింది. ఇక ఇప్పుడు ఈసినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో ఈసినిమా స్ట్రీమింగ్ అవుతుంది. మరి థియేటర్లలో మిస్ అయిన వారు ఓటీటీలో చూసి ఎంజాయ్ చేసేయండి.

ఫ్యామిలీ స్టార్
పరుశురాం దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా, మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా వచ్చిన సినిమా ఫ్యామిలీ స్టార్. ఎన్నో అంచనాల మధ్య ఈసినిమా ఏప్రిల్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈసినిమా అనుకున్నంత విజయాన్ని అందించలేకపోయింది అని చెప్పొచ్చు. ఇక ఇప్పుడు ఈసినిమా కూడా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన అమెజాన్ ప్రైమ్ లో ఈసినిమా స్ట్రీమింగ్ అవుతుంది.

భీమా
కన్నడ దర్శకుడు ఎ హర్షశ్రీ దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా వచ్చిన సినిమా భీమా. అవుట్‌ అండ్‌ అవుట్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈసినిమా శివరాత్రి పండుగ సందర్భంగా మార్చి8వ తేదీన రిలీజ్ అయింది. ఇక ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈసినిమా అనుకున్నంత విజయాన్ని అయితే అందించలేకపోయింది. ఇక ఈసినిమా కూడా ఓటీటీలో కి వచ్చేసింది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈసినిమా స్ట్రీమింగ్ అవుతుంది.

డియర్
ఆనంద్ రవిచంద్రన్ దర్శకత్వంలో జివి ప్రకాష్, ఐశ్వర్య రాజేష్ జంటగా నటించిన సినిమా డియర్.
కామెడీ ఫ్యామిలీ డ్రామాగా గురక కాన్సెప్ట్ తో వచ్చింది ఈసినిమా. ఈసినిమా ఏప్రిల్ 12వ తేదీన రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే అనుకున్నంత విజయాన్ని అయితే అందించలేకపోయింది. ఇక ఇప్పుడు ఈసినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. ఏప్రిల్ 28వ తేదీన ఈసినిమా ఓటీటీలో రిలీజ్ కానుంది.

ఇంకా ఈసినిమాలతో పాటు పలు సినిమాలు కూడా ఓటీటీలో సందడి చేయడానికి సిద్దమయ్యాయి. అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో వచ్చిన ఓ మై గాడ్2 సినిమా జియో సినిమాలో లపటా లేడిస్ అనే సినిమా నెట్ ఫ్లిక్స్ లో హిందీ క్రాక్ సినిమా హాట్ స్టార్ లో, రన్నేటి జియో సినిమా, సిటీ హంటర్ నెట్ ఫ్లిక్స్, గుడ్ బై ఎర్త్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు వస్తున్నాయి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

Post a Comment

Previous Post Next Post

Contact Form