స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘టిల్లు స్క్వేర్’. గతంలో ఆయన హీరోగా వచ్చిన ‘డీజే టిల్లు’కి సీక్వెల్‍గా రూపొందిన ఈ మూవీకి మల్లిక్ రామ్ దర్శకత్వం వహించారు. అలాగే హారో సిద్ధు జొన్నలగడ్డ ఈ సినిమాకు స్వయంగా కథనం, సంభాషణలు అందించడం విశేషం. అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటించగా.. మురళీధర్, ఆంథోనీ, సుజాత తదితరులు కీలక పాత్రలు పోషించారు.
కాగా ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. ఈ క్రమంలో మార్చి 29న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అందరి అంచనాలకు తగ్గట్లే టిల్లు స్క్వేర్ థియేటర్లలో నెక్స్ట్ లెవెల్లో రీసౌడింగ్ ఇచ్చింది. తొలిరోజునుంచే ఈ సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను అందుకుంది.
దీంతో రూ.125 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సిద్దు కెరీర్ లో తొలి 100 కోట్ల సినిమాగా రికార్డ్ సృష్టించింది. కాగా ఈ చిత్రం ఓటీటీలోనూ రికార్డుల మోత మోగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టిల్లు స్క్వేర్ ఓటీటీలోకి అడుగుపెట్టింది. శుక్రవారం నుంచి ఈ కామెడీ థ్రిల్లర్ ప్రముఖ ఓటీటీ ప్లాట్‍ఫామ్ నెట్‍ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో అందుబాటులో ఉంది. సో.. టిల్లు ఫ్యాన్స్ ఎంచక్కా ఇంట్లోనే ఈ మూవీని చూసేయండి.
మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి - Click Here
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇