టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా, ప్రశాంత్ వర్మ కాంబోలో వచ్చిన లేటెస్ట్ మూవీ ‘హనుమాన్’ సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చి సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. పండుగ బరిలో పలు స్టార్ హీరోల చిత్రాల మధ్య చిన్న సినిమాగా విడుదలై అనూహ్యంగా సూపర్ సక్సెస్ అందుకుంది. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం రూ.270 కోట్లకు పైగా వసూళ్లు సాధించి రూ. 300 కోట్ల దిశగా దూసుకుపోతోంది. ఇక ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి సహా పలువురు సినీ ప్రముఖులు ఈ సినిమా చూసి సోషల్ మీడియా వేదికగా చిత్ర బృందాన్ని ప్రశంసిస్తున్నారు.
మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి - Click Here
Tags
TeluguVersion