కమెడియన్ గా ఇండస్ట్రీకి పరిచయమైన ధనరాజ్ సినిమాల్లో కంటే జబర్దస్త్ కామెడీ షో ద్వారానే ఎక్కువ పాపులారిటీ సొంతం చేసుకున్నాడు. ఆ తరువాతా హీరోగా మారి పలు సినిమాలు కూడా చేశాడు. నిర్మాతగా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. ఇక ఇప్పుడు తానే దర్శకుడిగా మారి మరో కొత్త సినిమాతో రాబోతున్నాడు. తండ్రీ కొడుకుల అనుబంధం నేపథ్యంలో రామం రాఘవం అనే సినిమాతో వస్తున్నాడు. ఈసినిమాలో డైరెక్టర్ కమ్ టాలెంటెడ్ నటుడు అయిన సముద్రఖని కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. డిఫరెంట్ కాంబినేషన్ లో ఈసినిమా వస్తుండటంతో ఈసినిమా అంచనాలు బాగానే పెరిగాయి. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను ముగించుకుంటుంది. ఇప్పటికే పలు పోస్టర్లను కూడా రిలీజ్ చేశారు. ఇప్పుడు తాజాగా ఈసినిమా ఫస్ట్ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఎనర్జిటిక్ హీరో రామ్ చేతుల మీదుగా ఈసినిమా గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. గ్లింప్స్ అయితే ఫీల్ గుడ్ తో ఆకట్టుకుంటుంది.
For More Information - Click Here
Tags
TeluguVersion