ఓటీటీలోకి వచ్చేసిన ఫ్యామిలీ స్టార్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

 

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రధానపాత్రలో నటించిన తాజా చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ పరశురామ్ పెట్ల దర్శకత్వం వహించగా.. ‘సీతారామం’ ఫేమ్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటించారు. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ  సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ నిర్మించగా.. వాసు వర్మ క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు. భారీ అంచనాల మధ్య ఏప్రిల్ 5న ఈ మూవీ ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే.

అయితే తొలిరోజునుంచే ఈ ఫ్యామిలీ డ్రామాకు మిక్స్డ్ టాక్ వచ్చింది. దీంతో బాక్సాఫీస్ వద్ద అనుకున్న రేంజ్‍లో వసూళ్లను రాబట్టలేకపోయింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. అనుకున్న దాని కంటే ముందే ఓటీటీలోకి వచ్చేయడం విశేషం. విడుదలైన మూడు వారాల్లోనే ఈ సినిమా ప్రైమ్ వీడియోలోకి అడుగుపెట్టడం గమనార్హం. శుక్రవారం నుంచి ఫ్యామిలీ స్టార్ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు తమిళంలో అందుబాటులో ఉంది. సో.. విజయ్, మృణాల్ ఫ్యాన్స్ తో పటు మూవీ లవర్స్ ఎంచక్కా ఇంట్లోనే కూర్చుని ఫ్యామిలీ స్టార్ సినిమాను ఎంజాయ్ చేయండి.

మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి - Click Here 

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

Post a Comment

Previous Post Next Post

Contact Form