ఓటీటీలోకి వచ్చేసిన హనుమాన్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

టాలీవుడ్ యంగ్ అండ్ క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన విజువల్ వండర్ ‘హనుమాన్’. యువ నటుడు తేజ సజ్జా హీరోగా నటించగా శ్రీమతి చైతన్య సమర్పణలో ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌పై కె నిరంజన్ రెడ్డి నిర్మించారు. సంక్రాంతి కానుకగా ఈ ఏడాది జనవరి 12న విడుదలై ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. పండుగ బరిలో పలు స్టార్ హీరోల చిత్రాల మధ్య చిన్న సినిమాగా విడుదలై అనూహ్యంగా సూపర్ సక్సెస్ అందుకుంది. దాదాపు రూ. 40 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ రూ. 350 కోట్లుకు పైగా కలెక్షన్స్ వసూలు చేసి రికార్డ్ క్రియేట్ చేసింది.

మెగాస్టార్ చిరంజీవి సహా పలువురు సినీ ప్రముఖులు ఈ సినిమా చూసి ప్రశంసలు కురిపించారు. తెలుగు, హిందీ సహా రిలీజైన అన్ని భాషల్లోనూ బ్లాక్ బస్టర్ అయింది. దీంతో హనుమాన్ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని చాలా రోజులుగా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుస్తున్నారు. ఎట్టకేలకు హనుమాన్ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍ ‘జీ5’లో ఆదివారం (మార్చి 17, 2024) నుంచి హనుమాన్ తెలుగులో స్ట్రీమింగ్‍ అవుతోంది. కాగా థియేటర్లలో రిలీజైన 66 రోజుల తర్వాత ఈ చిత్రం ఓటీటీలోకి రావడం విశేషం. అయితే జియో సినిమాలో హనుమాన్ హిందీ వెర్షన్ మార్చి 16 అర్ధరాత్రి నుంచే స్ట్రీమింగ్ అవడం గమనార్హం.

మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి - Click Here 

Post a Comment

Previous Post Next Post

Contact Form