కొన్నిసినిమాలు రిలీజ్ కు ముందు వివాదాలు సష్టిస్తాయి. రిలీజ్ తరువాత కూడా వివాదాలు సృష్టిస్తాయి. అలాంటి కోవలోకే వస్తుంది ది కేరళ స్టోరీ సినిమా. సుదీప్తో సేన్ దర్శకత్వంలో యధార్థ సంఘటన ఆధారంగా ఈసినిమా వచ్చింది. ముగ్గురు కేరళ యువతులు ఇస్లాం మతంలోకి మారి తీవ్రవాదం వైపు ఎలా వెళ్లారు అనే కథాశంతో తెరకెక్కింది. ఇక గత ఏడాది రిలీజ్ అయిన ఈసినిమా సంచలన విజయం సాధించింది.
ఇక ఈసినిమా రీసెంట్ గానే ఓటీటీలో కి వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఓటీటీలో రిలీజ్ కు కూడా పలు ఇబ్బందులే ఏర్పడ్డాయి కానీ ఫైనల్ గా ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన జీ5లో రిలీజ్ అయింది. అయితే ఓటీటీ కూడా ఈసినిమా సంచలనం సృష్టిస్తుంది. తాజాగా ఈసినిమా ఏకంగా 300 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ ని క్రాస్ చేసినట్టుగా తెలిపారు. మరి దీంతో ఈసినిమాకు ఎంత క్రేజ్ ఉందో అర్థమవుతుంది.
మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి - Click Here