ఈఏడాది ఇప్పటికే కెప్టెన్ మిల్లర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్ ను అందుకున్నాడు ధనుష్. ఇప్పుడు అటు తెలుగు, ఇటు తమిళ్ లో పలు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇక వాటిలో తన దర్శకత్వంలోనే వస్తున్న ఒక సినిమా కూడా ఉంది. ఇక ఈసినిమా ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ ను కూడా ఈమధ్యే రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. రాయన్ అనే టైటిల్ ను ఈసినిమాను ఫిక్స్ చేశారు.
ఈసినిమా నుండి వరుసగా పోస్టర్లను రిలీజ్ చేస్తూ వస్తున్నారు. ఈసినిమా నుండి ఇప్పటికే ఎస్ జే సూర్య, సెల్వ రాఘవన్ పోస్టర్లను రిలీజ్ చేశారు. ఇప్పుడు ఈసినిమాలో నటిస్తున్న మరో కీలకపాత్రకు
సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేశారు. ప్రకాష్ రాజ్ కూడా ఈసినిమాలో ఒక కీలక పాత్రలో నటిస్తున్న నేపథ్యంలో తాజాగా ఆయన పోస్టర్ ను తన ట్విట్టర్ ద్వారా రిలీజ్ చేశాడు ధనుష్.
మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి - Click Here
Tags
TeluguVersion