ఊరుపేరు భైరవకోన పిల్లల కోసం స్పెషల్ షో

 

ట్యాలెంటెడ్ డైరెక్టర్ విఐ ఆనంద్ దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా వచ్చిన సినిమా ఊరు పేరు భైరవకోన. ఎన్నో అంచనాల మధ్య ఈసినిమా ఫిబ్రవరి16 వ తేదీన రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈసినిమాకు మంచి రివ్యూసే వచ్చాయి. చాలా కాలం తరువాత సందీప్ కిషన్ కు ఈసినిమాతో డీసెంట్ హిట్ దక్కింది. ఇక కలెక్షన్స్ పరంగా కూడా ఈసినిమా మంచి కలెక్షన్స్ ను అందిస్తుంది. మూడు రోజుల్లోనే ఈసినిమా 20 కోట్లకుపైగా కలెక్షన్స్ ను రాబట్టుకోగా ఒక్క నైజాం లోనే 5 కోట్లు కలెక్ట్ చేసుకుంది. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. ఇక ఇదిలా ఉండగా ఈసినిమా నుండి తాజాగా మరో అప్ డేట్ వచ్చింది. ఈసినిమాను పిల్లల కోసం స్పెషల్ షోను వేయనున్నట్టు తెలిపారు. ఏఎంబీ సినిమాస్ లో ఈసినిమా స్పెషల్ షో వేయనున్నారు.

మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి - Click Here

Post a Comment

Previous Post Next Post

Contact Form