ప్రభాస్ నుండి రాబోతున్న మోస్ట్ అవైటెడ్ సినిమా కల్కి 2898ఏడి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఈసినిమా రాబోతుంది. ఇప్పటివరకూ ఈసినిమా నుండి పలు వీడియోలను రిలీజ్ చేయగా అవి ఏరేంజ్ లో రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయో చూశాం. ఈసినిమా రిలీజ్ డేట్ ను కూడా ఈమధ్యే ప్రకటించిన సంగతి కూడా తెలిసిందే కదా. మే 9వ తేదీన ఈసినిమాను ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ చేయనున్నారు. ఫిబ్రవరి నెల కూడా ముగియడానికి వచ్చేస్తుంది. ఇంకా రెండు నెలలు మాత్రమే ఉండటంతో సినిమాను అప్పటిలోపు రెడీ చేసే పనిలో ఉన్నారు మేకర్స్.
మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి - Click Here
Tags
TeluguVersion