సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వస్తున్న సినిమా పుష్ప2. ఈసినిమా పుష్ప సినిమాకు సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే కదా. అల్లు అర్జున్ ఫుల్ డీ గ్లామరైజ్డ్ గా రా అండ్ రస్టిక్ మేకోవర్ లో గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో వచ్చిన ఈసినిమా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీంతో పార్ట్ 2 పై హై ఎక్స్ పెక్టేషన్స్ పెరిగిపోయాయి. అందుకే సుకుమార్ కాస్త టైమ్ తీసుకొని పార్ట్ 2కోసం సాలిడ్ కథను రాసుకున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను శరవేగంగా జరుపుకుంటుంది. ఇదిలా ఉండగా అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా ఈసినిమా నుండి ఒక వీడియోను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఇక ఆవీడియోకు ఏ రేంజ్ లో రెస్పాన్స్ వచ్చిందో కూడా చూశాం.
మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి - Click Here
Tags
TeluguVersion