రీసెంట్ గా సలార్ తో బ్లాక్ బస్టర్ హిట్ ను కొట్టాడు. ఇక ఇప్పుడు పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ప్రభాస్ నుండి రాబోతున్న మోస్ట్ అవైటెడ్ సినిమా కల్కి2898ఏడీ. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఈసినిమా రాబోతుంది. మే 9వ తేదీన ఈసినిమాను ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ చేయనున్నారు. ఈమేరకు ఆదిశగానే పనులు కూడా పూర్తి చేస్తున్నారు. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది.
దీనితో పాటు మారుతి దర్శకత్వంలో కూడా ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. రాజా సాబ్ అనే టైటిల్ తో ఈసినిమా వస్తుంది. ఇక ఈసినిమా షూటింగ్ గురించి ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. కల్కి సినిమా షూటింగ్ దాదాపు పూర్తవ్వడంతో రాజాసాబ్ షూట్ కు రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది. మరికొద్ది రోజుల్లోనే ఈసినిమా షూటింగ్ లో పాల్గొననున్నాడట.
మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి - Click Here
Tags
TeluguVersion